RAPO23 లో విలన్‌గా సూర్య.. షాకింగ్‌గా పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ ‘RAPO 23’ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

RAPO23 లో విలన్‌గా సూర్య.. షాకింగ్‌గా పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ ‘RAPO 23’ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తానే స్వయంగా కథను అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్టు‌ను కృష్ణ పోతినేని నిర్మించనుండగా, ఇందులో రామ్ ‘వీర్’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. 2026 డిసెంబర్ లక్ష్యంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకు సంబంధించిన లేటెస్ట్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. మొదట ఇందులో విలన్ పాత్ర కోసం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్‌ను ఫిక్స్ చెయ్యగా.. రెమ్యునరేషన్ విషయంలో డిఫరెంట్స్ వచ్చి ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఇప్పుడు ఆయన ప్లేస్‌లోకి విలన్‌గా ఎస్.జె. సూర్యతో చర్చలు జరుపుతున్నారట మూవీ టీమ్. పారితోషికం సెట్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో ఇవ్వనున్నారు మేకర్స్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి పేరు పరిశీలనలో ఉండగా.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Next Story