- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సానియా మీర్జా.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ అప్పుడే..
టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని.. ఓ కొడుకుకు జన్మనిచ్చిన ఆమె.. కొంత కాలం తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కొడుకును చూసుకుంటూ సింగిల్ మదర్‌గానే ఉంటోంది.

దిశ, వెబ్ డెస్క్ : టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని.. ఓ కొడుకుకు జన్మనిచ్చిన ఆమె.. కొంత కాలం తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కొడుకును చూసుకుంటూ సింగిల్ మదర్‌గానే ఉంటోంది. అయితే రీసెంట్ బజ్.. ఆమె ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు చెప్తోంది. ఓ కాఫీ షాపులో మీట్ అయి.. క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. అయితే త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక ఇంతకు ముందు కూడా సానియా... క్రికెటర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇదంతా అవాస్తవమని ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఆ రూమర్స్‌కు చెక్ పడింది. ప్రజెంట్ టాలీవుడ్ హీరోతో రెండో పెళ్లి టాపిక్ తెరమీదకు వచ్చింది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ మొదటి పెళ్లితో తప్పు చేసిన సానియా.. కనీసం రెండో పెళ్లి అయినా ఆచి తూచి చేసుకోవాలని సూచిస్తున్నారు అభిమానులు. ఆమెకు అంతా శుభమే జరగాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.






