- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rukshar Dhillon: స్టేజ్ పైనే తన ఎక్స్‌కి మెసేజ్ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా ఉంటా అంటూ..
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dil Ruba).

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dil Ruba). యంగ్ బ్యూటీ రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్(Theatrical release)కు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా ‘దిల్ రూబా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. ‘‘దిల్ రూబా’ సినిమాలో అంజలి క్యారెక్టర్(Anjali Character)లో నటించాను. అంజలి క్యారెక్టర్ ఎనర్జిటిగ్‌గా ఉంటూనే ఎంతో ఎమోషనల్ డ్రైవ్(Emotional drive)తో సాగుతుంది. డెప్త్ ఉన్న డైలాగ్స్ (Dialogues) నాతో చెప్పించారు దర్శకుడు విశ్వ కరుణ్. ఇలాంటి పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ (Oriented roll) చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కో స్టార్‌గా కిరణ్ ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ అందించిన సహకారం మర్చిపోలేనిది. నా కృష్ణార్జున, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలను మీరంతా ఆదరించారు. అలాగే ‘దిల్ రూబా’ చిత్రాన్ని కూడా ఈ నెల 14న థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. ఇక మీ ఎక్స్‌కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా అని యాంకర్ (Anchor) ప్రశ్నించగా.. ‘మెసేజ్ ఇస్తా.. కానీ తను వింటారో లేదో నాకు తెలియదు. నిజానికి బ్రేకప్ టైమ్ (Breakup time)లో ఎక్స్‌కి చాలా నెగిటివిటీ, చాలా బాధ ఉంటోంది. అయితే.. కొంచెం టైం తర్వాత మనం రీలైజ్ అవుతాం.. ఏదైనా మన మంచికే అని. అలాగే నీకు రాసిపెట్టి ఉన్నవాళ్లు ఖచ్చితంగా మనకోసం వస్తారు. కాబట్టి.. మీరు హ్యాపీగా ఉండండి.. మేము కూడా హ్యాపీగా ఉంటాం’ అని తెలిపింది.






