Rukmini Vasant: ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆ హీరో అలా ప్రవర్తిస్తారు.. హీరోయిన్ రుక్మిణి వసంత్ కామెంట్స్

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘మదరాసి’ ఒకటి.

Rukmini Vasant: ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ  ఆ హీరో అలా ప్రవర్తిస్తారు.. హీరోయిన్ రుక్మిణి వసంత్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasant) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘మదరాసి’ ఒకటి. శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం సప్టెంబర్5న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా.. బెంగుళూరులో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఈమె శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నా అభిప్రాయం ప్రకారం.. శివకార్తికేయన్ సర్ చాలా ఆత్మపరిశీలన చేసుకునే వ్యక్తి. ఆయన చాలా నిజాయితీపరుడు. అతను ఎంత ఎత్తుకు ఎదిగిన నిత్యం సినిమా విద్యార్థిగా ఉంటారు. ఇది చాలా మంది ఉన్నత వ్యక్తుల్లో నేను చూసిన గొప్ప విషయం. ఆయన ఎంతో ఉన్నత స్థాయి విజయాన్ని చేరుకున్నప్పటికీ.. తన వ్యక్తిత్తవం, నిజాయితీ, సింప్లీసిటీ నిజంగా అలాంటి వ్యక్తి ఉండటం ప్రశంసనీయం’ అని తెలిపింది రుక్మిణి.

Next Story