Rukmini Vasanth: మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని నేను కూడా వెయిట్ చేస్తున్నా.. రుక్మిణి వసంత్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ‘కాంతార చాప్టర్: 1’తో బిజీగా ఉంది.

Rukmini Vasanth: మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని నేను కూడా వెయిట్ చేస్తున్నా.. రుక్మిణి వసంత్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ‘కాంతార చాప్టర్: 1’తో బిజీగా ఉంది. రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నది. కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. రుక్మిణి వసంత్ ‘కాంతార చాప్టర్: 1’లో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

‘నా కెరీర్‌లో నేను చేసిన బెస్ట్ పాత్రలలో యువరాణి కనకవతి పాత్ర కూడా ఒకటి. మన జానపద కథలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన చిత్రమిది. కనకవతి రాజవంశానికి చెందిన అమ్మాయి. కానీ ఆమెలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఇందులో కనకవతికి ఉన్న దయ, ధైర్యం చూసి ఈ పాత్రను ఒప్పేసుకున్నాను. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం రావడం, ఈ అవకాశం నాకు ఇవ్వడం సంతోషంగా ఉంది. థియేటర్స్‌లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడూ చూస్తారా అని నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా’ అని తెలిపింది.

Next Story