తన కొత్త సినిమా అప్డేట్ షేర్ చేసిన బ్యూటీ.. అల్టిమేట్ షో డౌన్ ప్రారంభమవుతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ‘సప్త సాగరాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

తన కొత్త సినిమా అప్డేట్ షేర్ చేసిన బ్యూటీ.. అల్టిమేట్ షో డౌన్ ప్రారంభమవుతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ‘సప్త సాగరాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత భఘీర, రణగాల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీ గా మారిన రుక్మిణి వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్-నీల్(NTR-Neel) చిత్రంతో పాటు కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సరసన ‘మదరాసి’(madharasi)లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలతో పాటు రుక్మిణి, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ‘ACE’ రాబోతుంది. ఆరుముగ కుమార్(Arumuga Kumar) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో యోగిబాబు,దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బీఎస్ అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్.

ఆల్విన్ మార్టిన్, ప్రిస్సిల్లా నాయర్, జాస్పర్ సుపయ్య, కార్తీక్ జై, నాగులన్, జహ్రినారిస్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా రాబోతుండగా.. దీనిని 7Cs ఎంటర్టైన్మెంట్ పతాకంపై అరుముగ కుమార్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 23న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ షేర్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, రుక్మిణి ‘ACE’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అల్టిమేట్ షోడౌన్ ప్రారంభమవుతుందంటూ’’ క్యాప్షన్ జత చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story