అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న రుక్మిణి వసంత్

by Pulgam srinivas |

అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న రుక్మిణి వసంత్.

అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న రుక్మిణి వసంత్
X

దిశ, వెబ్ డెస్క్: తక్కువ సమయంలోనే ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణుల్లో రుక్మిణి వసంత్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.




తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ వీడియోలో రుక్మిణి పాత్రను కూడా మేకర్స్ పరిచయం చేశారు. ఈ గ్లింప్స్‌లో సినిమాలో కనిపించబోయే పలువురు కీలక పాత్రధారులతో పాటు రుక్మిణి వసంత్ పాత్రకు సంబంధించిన షాట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




దీంతో ఈ చిత్రంలో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమా విజయవంతమైతే రుక్మిణి వసంత్ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా రుక్మిణి వసంత్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




ఇందులో ఆమె అల్ట్రా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో విభిన్న యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా ఆమె ధరించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ స్టైలిష్ లుక్‌లో రుక్మిణి వసంత్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story