Rukmini Vasanth: మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టిన క్రేజీ బ్యూటీ..

by Chukka Sudharani |

‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాతో కన్నడతో పాటు తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది రుక్మిణి వసంత్

Rukmini Vasanth: మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టిన క్రేజీ బ్యూటీ..
X

దిశ, సినిమా: ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాతో కన్నడతో పాటు తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). ఇక ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం మూడు పాన్ ఇండియా చిత్రాలు లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘కాంతార-2’ (Kantara-2), ‘NTR-31’ అనౌన్స్‌మెంట్ రాగా.. ఇప్పుడు మరో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’.

జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్, వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఫిక్స్ కాగా.. నయనతార కీలక పాత్రలో నటిస్తున్న టాక్. ఇప్పుడు ఈ టాక్సిక్ (Toxic) ప్రపంచంలో కి రుక్మిణి వసంత్ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందట ఈ బ్యూటీ. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. టాక్సిక్ మూవీ వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. లింక్

Next Story