- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
64 ఏళ్ల హీరో సినిమాలో రుక్మిణి వసంత్ కు స్పెషల్ రోల్ ?
కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రుక్మిణి వసంత్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 2019 సంవత్సరంలోనే కన్నడ

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రుక్మిణి వసంత్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 2019 సంవత్సరంలోనే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులారిటీని దక్కించుకుంటోంది. 2024 సంవత్సరంలో వచ్చిన అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాతో మెరిసిన రుక్మిణి, ఈ మధ్యకాలంలో కాంతార చాప్టర్ 1 సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమాలో కనకావతి అనే బ్యూటిఫుల్ పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు రుక్మిణి. ఎవరు ఊహించని రీతిలో విలన్ పాత్రలో అందరినీ మెప్పించారు రుక్మిణి వసంత్.
అయితే, ఇప్పుడు ఈ బ్యూటీకి మరో అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వారమే ఈ సినిమా పూజా కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. నయనతార, త్రిష లాంటి వాళ్లను సంప్రదిస్తున్నారట. అయితే 64 సంవత్సరాల వయసున్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా నెగిటివ్ పాత్ర అని సమాచారం. కాంతారా చాప్టర్ వన్ తరహా లోనే ఉంటుందట. దీంతో ఆమె పాత్ర పై ఆసక్తి నెలకొంది.






