- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెట్టింట దుమారం రేపుతున్న రుక్మిణి బికినీ వీడియో.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన హీరోయిన్
తనది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బికినీ వీడియోపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ రుక్మిణి వసంత్.

దిశ, సినిమా: ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడుకి సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ తన ఆశలన్ని ఎన్టీఆర్ ‘డ్రాగన్’ పైనే పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి సంబంధించిన బికినీ వీడియో క్లిప్స్, ఫొటోస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల్లో హిట్స్ లేక సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేస్తుందా అంటూ నెట్టింట ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే నెట్టింట వైరల్‌గా మారిన బికినీ వీడియోపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది రుక్మిణి.
‘నేను అని చెప్పుకుంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న కొన్ని AI-సృష్టించిన వీడియోలు, ఫొటోలు నా బృందం అండ్ నేను గమనించాము. ఈ చిత్రాలు పూర్తిగా నకిలీవి.. అలాగే కల్పితమైనవని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఇలాంటి తారుమారు చేయబడిన కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం అండ్ గోప్యత యొక్క తీవ్రమైన ఉల్లంఘన. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చిత్రాలను సృష్టించి, వ్యాప్తి చేయడంలో పాలుపడిన వారిపై అవసరమైన చట్టపరమైన, అండ్ సైబర్‌క్రైమ్ చర్యలను ప్రారంభిస్తున్నాము. ప్రతిఒక్కరూ ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం, లేదా దాని గురించి మాట్లాడుకోవడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాము’ అంటూ నోట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో.. ఆ బికినీ వీడియో తనది కాదని తెలుసుకున్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.






