Rukmini Vasant: అవార్డ్స్ వేడుకకు కొత్త అందాన్ని తీసుకొచ్చిన యంగ్ బ్యూటీ

by Pulgam srinivas |

సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో అవార్డ్స్ వేడుకకే అందాన్ని తీసుకువచ్చిన రుక్మిణి వసంత్

Rukmini Vasant: అవార్డ్స్ వేడుకకు కొత్త అందాన్ని తీసుకొచ్చిన యంగ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 'సప్త సాగరాలు దాటి సైడ్ ఎ', 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా అనేక చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది.




కొంతకాలం క్రితం 'కాంతార చాప్టర్ 1' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఈమె తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.




ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సూపర్ స్టైలిష్ లుక్‌లో ఉన్న డ్రెస్‌లు వేసుకొని వెళ్తోంది.




దాంతో ఈమె ఆ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా INCA అవార్డ్స్ వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. దీనికి రుక్మిణి కూడా విచ్చేసింది. ఇక ఈ ఈవెంట్‌కు ఈమె అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న స్లీవ్‌లెస్ సిల్వర్ కలర్ డ్రెస్‌ను వేసుకొని వచ్చింది.




అలాగే ఈమె ఈ డ్రెస్‌లో అదిరిపోయే యాంగిల్స్‌లో ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చింది. ఇందులో ఈమె ఎంతో అందంగా కనిపించడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Next Story