- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రుక్మిణి’ పోస్టర్ రిలీజ్ చేసిన రాజేంద్ర ప్రసాద్
నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్‌గా జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా ‘రుక్మిణి’. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

దిశ, సినిమా : నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్‌గా జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా ‘రుక్మిణి’. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాగా న్యూ ఇయర్ డే సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘రుక్మిణి’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ .. ‘గంగాధర్ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ వంటి ఎన్నో హిట్ మూవీస్‌కు మాతో వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా ‘రుక్మిణి’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా చిన్న సినిమా ఆదరణ పొందినప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. చిన్న చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకునే నటుడిని నేను. ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ‘రుక్మిణి’ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అందిస్తున్నా’ అన్నారు.






