- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ruhanika Dhawan: చదువు కారణంగా నా యాక్టింగ్ కెరీర్ ఆగిపోయింది.. ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘యే హై మొహబ్బతే’ అనే హిందీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ (Child artist) రుహానికా ధావన్ (Ruhanika Dhawan).

దిశ, సినిమా: ‘యే హై మొహబ్బతే’ అనే హిందీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ (Child artist) రుహానికా ధావన్ (Ruhanika Dhawan). ఇక ఈ సీరియల్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో వేదికగా తన ఫొటోలను పంచుకుంటూ సందడి చేస్తుంది. అయితే.. ఈ సీరియల్ తర్వాత మరో దాంట్లో నటించని ఈ యంగ్‌స్టర్ చదువుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా తన పన్నెండో తరగతి ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) బోర్డు ఫలితాలు రావడంతో.. అందులో తను 91% మార్కులు సాధించింది. దీంతో యాక్టింగ్‌పై రుహానికా స్పందిస్తూ..
‘నా ఇంటర్‌లో 91% స్కోర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నిజంగా ఎంతో కష్టపడి చదివాను. నా చదువుపై దృష్టి పెట్టడానికి నేను నా నటనా జీవితాన్ని మూడు సంవత్సరాలు ఆపాను. అలా చేయడం మంచిది అయింది అని ఇప్పుడు భావిస్తున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నా ఇంటర్ మార్కుల విజయం పట్ల గర్వపడుతున్నారు. వారు నాపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు. ఈరోజు ఆ నమ్మకాన్ని నేను నిరూపించుకున్నాను. చాలా గర్వంగా అనిపిస్తుంది. నా వయస్సు గల ఇతర నటులు చదువుకుంటూ ప్రాజెక్టులు చేస్తుండగా.. నేను మాత్రం నా చదువుపై దృష్టి పెట్టాలని ఎంచుకున్నాను’ అని తెలిపింది. కాగా.. ‘యే హై మొహబ్బతే’ సీరియల్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’ అనే పేరుతో తెలుగులో డబ్ చేయబడింది.






