‘మృదువైన గుసగుసలలో’ అంటూ బెడ్‌పై టవల్‌తోనున్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. బోల్డ్ పిక్స్ వైరల్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma)గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘మృదువైన గుసగుసలలో’ అంటూ బెడ్‌పై టవల్‌తోనున్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. బోల్డ్ పిక్స్ వైరల్
X

‘మృదువైన గుసగుసలలో’ అంటూ టవల్‌పైనున్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. బోల్డ్ పిక్స్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma)గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే యువతను ఫిదా చేసిందనడంలో అతిశయోక్తిలేదు. చిలసౌ చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. థియేటర్లలో మూవీ అంతగా ఆడలేదు. కానీ ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఆగ్ర (Āgra) అనే హిందీ సినిమాలో అవకాశం దక్కింది. ఈ మూవీని గత సంవత్సరం కేన్స్ పిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం(Cannes Film Festival program)లో కూడా ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

అంతేకాకుండా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తెలుగులోకి అందుబాటులోకి రానప్పటికీ హిందీలోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో రుహానీని.. ఆ రేంజ్‌లో చూసి నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. టవల్ కట్టుకుని బెడ్ పై వయ్యారాలు వలకబోసింది. కనిపించి కనిపించని ఎదఅందాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు అభిమానులతో పంచుకోగా.. యువత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పిక్స్‌కు..‘‘ మృదువైన గుసగుసలలో, వెండి కాంతిలో’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story