- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ravi Teja RT76 షూటింగ్ స్టార్ట్.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు రవితేజ లేటెస్ట్‌గా తన 76వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. RT-76 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ (Kishore) దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌లో ఈ చిత్రం వస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. RT-76 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
దీంతో ఈ మూవీ సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని రవితేజ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా RT-76కి సంబంధించిన షూటింగ్ అప్డేట్‌తో పాటు, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘టాకీ పార్ట్ చిత్రీకరణతో RT76 సెట్స్ పైకి దూసుకుపోతోంది. టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తాము. 2026 సంక్రాంతికి సినిమా థియేటర్లలోకి రాబోతుంది’ అని తెలిపారు. కాగా.. ప్రస్తుతం స్టార్ట్ అయినా టాకీ పార్ట్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో రవితేజ తనదైన కంఫర్ట్ జోన్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నాడని టాక్.






