- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RT-76: ఫుల్ స్వింగ్‌లో మాస్ మహారాజ్ రవితేజ.. ఈ పండక్కి వచ్చేస్తున్న అంటూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్..
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన సొంత కష్టంతో అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోగా మారారు. ఇక అతనికి, ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అయితే మన మాస్‌మహారాజ్ నెలకు లేదా రెండు నెలలకు ఓ కొత్త మూవీతో వచ్చి ఆడియన్స్‌ను మెప్పిస్తుంటాడు. ప్రస్తుతం ‘మాస్ జాతర’(Mass Jathara) సినిమాలో నటిస్తున్న రవితేజ.. ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో సరికొత్త మూవీను అనౌన్స్ చేశారు.
రవితేజ కెరియర్లో ఇప్పటివరకు 75 సినిమాలు చేయగా ఇప్పుడు 76వ సినిమాకు.. రంగం సిద్ధం చేశారు. RT-76 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్(Kishore) దర్శకత్వం వహిస్తుండగా… సుధాకర్(sudhakar) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రం వస్తోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాకుండా… రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. దీంతో రవితేజ.. అభిమానులు… ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.






