వెంకటేష్ ఇంటికి మోహన్ భగవత్..అగ్ర‌హీరోలతో స‌మావేశం !

by velandi.Saikiran |

వెంకీ మామ ఇంట్లో జరగబోయే ఈ సమావేశానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీ, నాని, తేజా సజ్జా లాంటి హీరోలతో పాటు నిర్మాతలు మైత్రి రవి, సాహు లాంటి వారు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ భగవత్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకటేష్ ఇంటికి మోహన్ భగవత్..అగ్ర‌హీరోలతో స‌మావేశం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు, నిర్మాతలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ( Mohan Bhagwat) సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని వెంకీ మామ ఇంట్లో ఈ కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట.

హీరో వెంకటేష్ ఇంట్లో మోహన్ భగవత్ సమావేశం

వెంకీ మామ ఇంట్లో జరగబోయే ఈ సమావేశానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీ, నాని, తేజా సజ్జా లాంటి హీరోలతో పాటు నిర్మాతలు మైత్రి రవి, సాహు లాంటి వారు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ భగవత్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే టాలీవుడ్ అగ్ర హీరోలతో సమావేశం అవుతున్నారట. ఇది కేవలం ఫ్రెండ్లీ మీటింగ్ అని అంటున్నారు. ఈ సమావేశానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. మోహన్ భగవత్ రంగంలోకి దిగాడు అంటే పెద్ద స్కెచ్ ఉంటుందని.. ఈ సమావేశం వెనుక ఏదో మత లాబ్ ఉందని ఇండస్ట్రీకి చెందినవారు అంచనా వేస్తున్నారు.

Next Story