- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 252 కోట్ల డ్రగ్స్ దందాలో బాలీవుడ్ భామలు.. ఆ ఇద్దరు హీరోయిన్ల అరెస్ట్ తప్పదా..?
బాలీవుడ్ నటీనటులకు రూ. 252 కోట్ల డ్రగ్ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తుంది ముంబై పోలీసుల యాంటీ నార్కాటిక్స్ సెల్. అండర్ వరల్డ్ ఫిగర్ దావూద్ ఇబ్రహీం సిండికేట్‌కు లింక్ ఉన్నట్లు.. దుబాయ్‌లోని అతని సహచరుడు సలీం

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటీనటులకు రూ. 252 కోట్ల డ్రగ్ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తుంది ముంబై పోలీసుల యాంటీ నార్కాటిక్స్ సెల్. అండర్ వరల్డ్ ఫిగర్ దావూద్ ఇబ్రహీం సిండికేట్‌కు లింక్ ఉన్నట్లు.. దుబాయ్‌లోని అతని సహచరుడు సలీం డోలా ద్వారా ఈ నెట్ వర్క్ నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల అరెస్ట్ చేయబడిన తాహెర్ మర్చెంట్ అలియాస్ సలీం షైఖ్‌కు సంబంధించిన రిమాండ్ దరఖాస్తు డాక్యుమెంట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. దుబాయ్‌తోపాటు ఇతర ఫారిన్ కంట్రీస్ నుంచి డ్రగ్స్ అందిస్తూ అంతర్జాతీయ మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తేలింది. లగ్జరీ, డ్రగ్-ఫ్యూల్డ్ పార్టీలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని.. ఈ ఈవెంట్‌లలో హై-ప్రొఫైల్ సెలబ్రిటీ ఫిగర్స్ ఉన్నారని తెలుస్తోంది. విమానం, సముద్రం ద్వారా స్మగ్లింగ్ జరుగుతుందని.. ఫండ్స్ హవాలా ద్వారా లాండర్ చేయబడ్డాయని గుర్తించబడింది.
కాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఆమె సోదరుడు సిద్ధాంత్ కపూర్ ఈ హై ప్రొఫైల్ ఈవెంట్స్‌కు హాజరయ్యారని.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ నోరా ఫతేహీకి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ, ఫిల్మ్ మేకర్స్ అబ్బాస్ - ముస్తాన్, రాపర్ వరుణ్ మఠుర్ ఈవెంట్స్‌లో పాలగొన్నారని సమాచారం. కాగా ముంబై పోలీసులు త్వరలోనే వీఐపీలను స్టేట్మెంట్స్ కోసం పిలవనున్నారు. ఇది వారి పాత్రలపై లోతైన పరిశోధనకు దారితీస్తుంది.






