నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగచైతన్య రూ.100 కోట్ల సినిమా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel).

నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగచైతన్య రూ.100 కోట్ల సినిమా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించింది. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Aravind) నిర్మించగా.. ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లోకి రావడంతో అంతా మూవీ మేకర్స్ అలర్ట్ అయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అయినప్పటికీ ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు. అయినప్పటికీ ‘తండేల్’ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లకు పైగానే వసూలు చేసి నాగచైతన్య కెరీర్‌లోనూ ఎక్కువ కలెక్షన్లు రాబట్టి సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘తండేల్’ మూవీ విడుదలైన నెలరోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాను సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.

Next Story