- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా ఈవెంట్లో ఓవర్గా మాట్లాడాను.. దాంతో అందరూ అలా అన్నారు.. ఆర్పీ పట్నాయక్
తాజాగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ... జయం మూవీ ఆడియో ఫంక్షన్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి టేప్ రికార్డర్ లో ఈ సినిమా పాటలు ప్లే అవుతాయని స్టేట్మెంట్ ఇచ్చాను, దాని విషయంలో చాలామంది నాకు కౌంటర్లు వేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకులలో ఆర్పీ పట్నాయక్ ఒకరు. ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేయకపోయినా, కొన్ని సంవత్సరాల క్రితం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగారు. ఈ సంగీత దర్శకుడికి ఎక్కువ శాతం తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. నితిన్ హీరోగా, సదా హీరోయిన్గా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం మూవీకి ఈయనే సంగీతం అందించాడు.
ఈ మూవీ మంచి విజయం సాధించడమే కాకుండా, ఇందులోని అన్ని పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో జయం విడుదలకు ముందు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ... "జయం సినిమా ఆడియో ఫంక్షన్లో నేను కాస్త ఓవర్గా మాట్లాడాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి టేప్ రికార్డర్లో కూడా జయం పాటలు వింటారు అని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. దాంతో అందరూ కూడా ఈయన కాస్త ఓవర్ చేస్తున్నాడు" అంటూ నాపై కౌంటర్లు వేశారు.
సినిమా విడుదలకు ముందే 'ప్రియతమా తెలుసునా' సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ జనాలు విపరీతంగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఆ పాటను ఎందుకో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా విడుదల అయిన తర్వాత మాత్రం ఆ సాంగ్ కి జనాలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం దానిని చిత్రీకరించిన విధానం. ఆ పాటను చాలా బాగా తెరకెక్కించారు. దాంతో విడుదల తర్వాత ఆ పాటకు మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి దక్కిందని ఆర్పీ పట్నాయక్ తాజాగా చెప్పుకొచ్చాడు.






