- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ ఎన్టీఆర్‌కు రౌడీ హీరో-సూపర్‌స్టార్ స్పెషల్ విషెష్.. పోస్ట్స్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 1983 మే 20న జన్మించిన తారక్ హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో 10 వ తరగతి పూర్తి చేసి.. సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం ప్రారంభించారు.
ప్రస్తుతం తారక్‌కు టాలీవుడ్‌లో మామూలు క్రేజ్ లేదు. సినీ ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ ఆల్ రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాలు, ఫైట్స్, డ్యాన్స్.. ఇలా ప్రతిదాంట్లో తన ప్రతిభ చాటారు. నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తారక్‌కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ పేరు వింటేనే కొంతమంది అభమానులకు పూనకాలస్తాయనడంలో అతిశయోక్తిలేదు.
అయితే నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తారక్ అభిమాని అయిన హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికన స్పెషల్ విషెష్ తెలియజేశారు.






