Vijay Devarakonda: ఐకాన్‌స్టార్‌కు రౌడీ హీరో స్పెషల్ గిఫ్ట్స్.. ఏమిచ్చాడో తెలిసా?

by Kodari Anjali |   (  Updated:2024-11-29 09:52:11  IST  )

డిసెంబరు 5 వ తేదీన విడుదలవ్వబోతున్న ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Vijay Devarakonda: ఐకాన్‌స్టార్‌కు రౌడీ హీరో స్పెషల్ గిఫ్ట్స్.. ఏమిచ్చాడో తెలిసా?
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబరు 5 వ తేదీన విడుదలవ్వబోతున్న ‘పుష్ప-2’(Pushpa-2) కోసం ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ జోరుగా నిర్వహిస్తున్నారు. మరో పక్క ఈ సినిమా కసం సంబరాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రెండో పార్ట్‌పై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఇక పుష్ప-2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(iconstar Allu Arjun)- రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే..

టాలీవుడ్ కుర్ర, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Rowdy hero Vijay Devarakonda)తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఓ ప్రత్యేకమైన బహుమతిని పంపించాడు. అప్పుడప్పుడు విజయ్.. బన్నీ(Bunny)కి రౌడీ బ్రాండ్ నుంచి డ్రెస్సెస్ పంపిస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా.. పుష్ప-2 విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్‌కు రెండు టీషర్ట్స్(Tshirts) పంపించాడు. ఒక దానిపై రౌడీ అని బ్రాండ్ పేరు ప్రింట్ ఉండగా.. మరొక టీషర్ట్ పై రౌడీతో పాటు పుష్ప అని ప్రింట్ చేసి ఉంది. ఇవి బన్నీ ఎప్పటిలాగే తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకుని ‘నా స్వీటెస్ట్ బ్రదర్ విజయ్ దేవరకొండ. నా మీదున్న నీ ప్రేమకు థ్యాంక్స్’ అంటూ ఓ క్యాప్షన్ జోడించాడు.

Next Story