‘రోటి కపడా రొమాన్స్’ పోస్ట్ పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |   (  Updated:2024-11-23 12:52:56  IST  )

హర్ష నర్రా(Harsha Narra), సందీప్ సరోజ్ (Sandeep Saroj)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’Roti Kapada Romance

‘రోటి కపడా రొమాన్స్’ పోస్ట్ పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: హర్ష నర్రా(Harsha Narra), సందీప్ సరోజ్ (Sandeep Saroj)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapada Romance). యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ (Beckem Venugopal).. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకత్వం వహించి ఈ మూవీలో తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ.. తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘నవ్వు, ప్రేమ & భావోద్వేగాల సంపూర్ణ సమ్మేళనాన్ని అనుభవించండి! విక్రమ్ రెడ్డి అద్భుతమైన దర్శకత్వం & ప్రదర్శనలో ఆహ్లాదకరమైన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన #RotiKapdaRomance చిత్రం నవంబర్ 28వ తేదీన మీ ముందుకు రానుంది. థియేటర్లలో ఈ ఆనంద యాత్రను మిస్ అవ్వకండి!’ అంటూ చెప్పుకొచ్చారు.


Click Here For Twitter Post..

Next Story