బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శైలేష్ కొలను నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. హీరో ఎవరంటే?

by Chukka Sudharani |

‘హిట్: మొదటి కేసు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను.. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నాడు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శైలేష్ కొలను నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. హీరో ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘హిట్: మొదటి కేసు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను.. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇదే చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చెయ్యగా.. అక్కడ కూడా హిట్ అందుకుంది. ఇక ఫ్రాంచైజీలో హిట్: రెండవ కేసు వచ్చి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత సైంధవ్, హిట్: మూడవ కేసు వంటి సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇలా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న డైరెక్టర్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

తన నెక్ట్స్ మూవీ యంగ్ హీరో రోషన్‌తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఛాంపియన్ చిత్రంతో బిజీగా ఉన్నా రోషన్.. ఈ సినిమా తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్‌లో మూవీ చేయబోతున్నాడట. వీరిద్దరి కాంబో ఆల్మోస్ట్ సెట్ కాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాలవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నట్లు టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లింక్


Next Story