ఇంద్రగంటి దర్శకత్వంలో రోషన్?

by Pulgam srinivas |

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందబోయే ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రోషన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంద్రగంటి దర్శకత్వంలో రోషన్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేక వరుస సినిమాలను ఓకే చేస్తూ జెట్ స్పీడ్‌లో ముందుకు వెళ్తున్నాడు. కొంతకాలం క్రితమే ఈయన నటించిన ‘ఛాంపియన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇప్పటికే రోషన్, శైలిష్ కొలను దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా మరో లవ్ స్టోరీకి కూడా ఈ యువ నటుడు ఓకే చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రోషన్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తయినట్లు, మరో కొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నటన, అందం పరంగా మంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ యువ నటుడికి సరైన విజయాలు మాత్రం దక్కడం లేదు. మరి రాబోయే ఈ చిత్రాలతో రోషన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Next Story