- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్మరైజ్ చేస్తున్న రోషన్, అనస్వర రాజన్ కెమిస్ట్రీ
యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’తో అలరించబోతున్నారు.

దిశ, సినిమా: యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో కూడా మంచి బజ్ క్రియేట్ కాగా.. తాజాగా పాట లిరికల్ వీడియో విడుదలైంది. మిక్కీ జే మేయర్ ఈ సాంగ్‌ని మెలోడీయస్ ట్రీట్‌గా కంపోజ్ చేశారు. మనసుని హత్తుకునే విధంగా కట్టిపడేసేలా ఉన్న ఈ పాటలో రోషన్, అనస్వరల మధ్య కెమిస్ట్రీ అందంగా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌తో చాంపియన్ సంగీత ప్రయాణం అద్భుతంగా ఆరంభం కాగా.. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.






