- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రోలుగుంట సూరి’.. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అంటున్న మేకర్స్
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’.

దిశ, సినిమా: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లాంచ్ చేశాడు. సాంగ్ ఆవిష్కరించిన అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘మంచి పాటలు ఉంటే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి హిట్ చేస్తారు. కథతో పాటు మ్యూజిక్ కూడా బాగుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ‘రోలుగుంట సూరి’ కూడా అలాంటి సినిమా. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే కథతో పాటు దానికి తగ్గట్టే మ్యూజిక్ కూడా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిత్రయూనిట్‌కు అభినందనలు’ అన్నారు. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ.. ‘మా సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను ఆవిష్కరించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కృషిని, మా టీం టాలెంట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. సబ్జెక్టుతో పాటు పాటలు కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతాయనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
- Tags
- Rolugunta Suri






