- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి నుంచే జగన్ ను విజయ్ ఫాలో అవుతున్నారు - రోజా
విజయ్ విక్టరీ పైన రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ చేసిన ప్రచారానికి మాస్ తో పాటు ఓటర్లు కూడా ప్రభావితం అయ్యారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. అధికార డీఎంకే పార్టీని చిత్తు చేసి, 108 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది విజయ్ TVK పార్టీ. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు విజయ్. అయితే విజయ్ విక్టరీ పైన ఏపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ చేసిన ప్రచారానికి మాస్ తో పాటు క్లాస్ ఓటర్లు కూడా ప్రభావితం అయ్యారన్నారు. ఒంటరిగా విజయం సాధించడం చరిత్ర అంటూ ప్రశంసించారు.
జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. జగన్ తో సన్నిహితంగా ఉండే వారికి వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందని వెల్లడించారు. మొదటి నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విజయ్ ఫాలో అవుతున్నారని... అందుకే సింగిల్ గా బరిలోకి దిగి, కింగ్ మేకర్ అయ్యాడని స్పష్టం చేశారు రోజా. విజయ్ పార్టీ పెట్టినప్పుడే అతను చరిత్ర సృష్టించడం ఖాయమని తాను అంచనా వేసినట్లు రోజా స్పష్టం చేశారు. దీంతో రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.






