పవన్ కళ్యాణ్ కొడుకుకు ప్రమాదం.. రోజా సంచలన పోస్ట్!

by velandi.Saikiran |   (  Updated:2025-04-08 12:06:20  IST  )

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ( Mark Shankar) జరిగిన ప్రమా

పవన్ కళ్యాణ్ కొడుకుకు ప్రమాదం.. రోజా సంచలన పోస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ( Mark Shankar) జరిగిన ప్రమాదంపై ఏపీ మాజీ మంత్రి, టాలీవుడ్ నటి రోజా ( Roja ) స్పందించారు. పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి అయినప్పటికీ... ఆయన కొడుకుకు జరిగిన ప్రమాదం పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రోజా. పవన్ కళ్యాణ్ చిన్న బాబు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) చిన్న బాబు మార్క్ శంకర్ ( Mark Shankar) ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచి వేసిందని ఎమోషనల్ అయ్యారు. ఈ చిన్నారి త్వరగా కోలుకొని దీర్ఘాయుష్, ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి మెలిసి ఆనందంగా గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు రోజా. అటు పవన్ కళ్యాణ్ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు రోజా.

ఇది ఇలా ఉండగా.... పవన్ కళ్యాణ్ కొడుకు అగ్ని ప్రమాదం సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) కూడా స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని.. ట్వీట్ చేశారు. ఇక ఈ ప్రమాద విషయం తెలియగానే సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..బయలు దేరారు. మన్యం పర్యటన ముగించుకుని విశాఖ నుంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్ లో సింగపూర్ కు పవన్ కళ్యాణ్ వెళ్లారు.

Next Story