The Paradise: నాని- శ్రీకాంత్ ఓదెల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా రాక్ స్టార్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-03 11:49:23  IST  )

నేచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘దసరా’(Dasara), ‘సరిపోదా శనివారం’(Saripoda Sanivaram) వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

The Paradise: నాని- శ్రీకాంత్ ఓదెల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా రాక్ స్టార్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘దసరా’(Dasara), ‘సరిపోదా శనివారం’(Saripoda Sanivaram) వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని తన స్వీయ నిర్మాణంలో ‘HIT- 3’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం అడివి శేష్(adivi Sesh) నటించిన ‘హిట్-2’(HIT-2) కు సీక్వెల్‌గా వస్తుంది. అయితే శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా దీన్ని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Thipirneni) నిర్మిస్తుండగా.. మిక్కీ మేయర్(Mickey Meyer) సంగీతం అందిస్తున్నారు.

అలాగే నాని.. శ్రీకాంత్ ఓదెలా(srikanth Odela)తో ఒక చిత్రం చేస్తున్నాడు. అయితే ఆయన గతంలో శ్రీకాంత్ ఒదెలతో కలిసి ‘దసరా’ మూవీ చేసి మంచి విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులు కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాపై మరింత భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా హింసాత్మకంగా ఉంటుందని ఇప్పటికే నాని ఒక ఇంటర్వ్యూలో తెలిపి మూవీ పై మరింత హైప్ పెంచేశాడు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాని- శ్రీకాంత్ ఓదెల సినిమాకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ ఎంపికైనట్లు తెలిపింది మూవీ టీమ్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక అందులో ‘ది ప్యారడైజ్’(The Paradise) సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్(anirudh) వ్యవహరిస్తున్నారు అని రాసుకొచ్చారు. అలాగే ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ‘అష్టా చమ్మా’(Ashta Chamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాటు అవార్డులు కూడా కైవసం చేసుకున్నాడు. సినిమాల్లో నాచురల్‌గా నటించడం అతని స్టైల్. ఏ సీన్ అయినా ఇట్టే జీవించేస్తాడు. ఇక ఇతని స్టైల్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకున్న ఈ హీరోకి ప్రస్తుతం ఒక బాబు. అలా ఓ పక్కా మ్యారీడ్ లైఫ్‌ను మరో పక్క సినిమాలతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.


Click Here Tweet..

Next Story