- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాబిన్ హుడ్’ కౌంట్ డౌన్ స్టార్ట్.. పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచుతున్న మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) జంటగా నటిస్తున్న తాజా మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) జంటగా నటిస్తున్న తాజా మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్(Ravi Shankar) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.
అయితే యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ రీసెంట్‌గా ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై మరింత హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలై పోస్టర్స్, టీజర్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా, చిత్రబృందం ‘రాబిన్‌హుడ్’ కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో రావడానికి ఇంకా 50 రోజులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరో నితిన్ ఓ బ్యాగ్ పట్టుకుని వస్తుండగా వెనక బ్యాక్ గ్రౌండ్‌లో 500 రూపాయల నోట్లు చెల్లా చెదురుగా గాలిలో ఎగురుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.






