రోడ్డు యాక్సిడెంట్ కేసు.. టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-29 04:03:27  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident) కేసులో టీవీ నటుడు లోబో (Lobo) అలియాస్ ఖయూమ్‌ (Qayyum)కు బిగ్ షాక్ తగిలింది.

రోడ్డు యాక్సిడెంట్ కేసు.. టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident) కేసులో టీవీ నటుడు లోబో (Lobo) అలియాస్ ఖయూమ్‌ (Qayyum)కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఇద్దరు మృతితో పాటు పలువురు క్షతగ్రాత్రులు అవ్వడానికి కారణమైన అతడికి జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా, 2018 మే 21న ఓ టీవీ ఛానల్‌ తరఫున ప్రోగ్రామ్ కోసం లోబో టీమ్ రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అయితే, లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్‌ (Warangal) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ (Nidigonda) వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు.

ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ తీవ్ర గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రఘునాథపల్లి పోలీసులు కేసులో.. పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదాలను విన్న న్యాయమూర్తి లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

Next Story