- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ritika Nayak:ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన అందాల భామ
సహజసిద్ధమైన అందంతో మెప్పిస్తున్న రితిక నాయక్.. ట్రెడిషనల్ లుక్‌లో క్యూట్ స్మైల్‌తో ఫిదా చేస్తున్న బ్యూటీ

దిశ, వెబ్ డెస్క్: తన సహజసిద్ధమైన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రితిక నాయక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె విశ్వక్ సెన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఆకాశవనంలో అర్జున కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందడం, అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తర్వాత ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేయకుండా, ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కొంతకాలం క్రితం ఈమె 'మిరాయ్' అనే పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో కూడా ఎక్కడా స్కిన్ షోకు ప్రాధాన్యం ఇవ్వకుండా, తన నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ షో చేయకుండా అభిమానులను సంపాదించుకున్న ఈ చిన్నది, సోషల్ మీడియాలో కూడా అదే పద్ధతిని ఫాలో అవుతోంది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో రితిక నాయక్ పీచ్ కలర్ ట్రెడిషనల్ లెహంగా ధరించి ఎంతో అందంగా మెరిసింది.
మ్యాచ్ అయ్యే ఎంబ్రాయిడరీ వర్క్, దుపట్టా ఆమె లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ముఖ్యంగా ఆమె క్యూట్ స్మైల్, కర్లీ హెయిర్ స్టైల్ ఈమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఈ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో రితిక నాయక్ ఎంతో క్యూట్‌గా, సొగసుగా మెరిసిపోతూ అభిమానులను ఫిదా చేస్తోంది.
దాంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి ప్రశంసలను అందుకుంటున్నాయి.






