- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rithu Chowdhury: లంగా వోణీలో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ
పసుపు రంగు లంగా వోణీలో మెస్మరైజ్ చేస్తున్న రీతూ చౌదరి.

దిశ, వెబ్ డెస్క్: సీరియల్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. ఆ తర్వాత ఆమె ‘బిగ్ బాస్’ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఎక్కువ వారాలు కొనసాగకపోయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
రీతూ ‘జబర్దస్త్’ కామెడీ షోలో కూడా పాల్గొంది. ఈ సీరియల్ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది.
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో రీతూ గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంచు కలిగిన పసుపు పచ్చ లంగా వోణి ధరించి, అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ లుక్‌కు మ్యాచింగ్ అయ్యేలా గాజులు, మెడలో పెద్ద నెక్లెస్ ధరించి, చిన్న బొట్టు పెట్టుకుంది. అలాగే తన కురులను ముఖంపై పడేలా ఉంచి వాటిని సవరిస్తూ, నడుంపై చేయి పెట్టుకుని అందమైన యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
రీతూ చౌదరికి సంబంధించిన ఈ సూపర్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






