- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రీక్వెల్ కోసం 100 కోట్లు డిమాండ్ చేస్తున్న హీరో..?
సినిమా ఇండస్ట్రీలో... హీరోలు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సినిమా ఒక్కటి హిట్ అయితే చాల

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో... హీరోలు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సినిమా ఒక్కటి హిట్ అయితే చాలు... ఆ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. అయితే.. అచ్చం కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఆయన ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో... తెరుకెక్కిన సినిమా కాంతార (Kantara). ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొని... చరిత్ర సృష్టించింది. ఈ సినిమా హోం భలే ఫిలిమ్స్ ఆధ్వర్యంలో తెరకెక్కించారు. 15 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తే ఏకంగా 400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా సమయంలో రిషబ్ శెట్టి కేవలం 4 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
దర్శకత్వం అలాగే హీరోగా చేసినందుకు... నాలుగు కోట్లు మాత్రమే తీసుకోవడం పట్ల అప్పట్లో విపరీతంగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ గా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం... 100 కోట్లు తీసుకుంటున్నాడట హీరో రిషబ్ శెట్టి. అటు చిత్ర బృందం కూడా ఆ రేంజ్ లో ఇచ్చేందుకు సిద్ధమైందట. కాగా ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.






