Riddhi Kumar: ముద్దుగుమ్మ అందాలతో సోషల్ మీడియా హీటెక్కుతుంది

by Pulgam srinivas |

Riddhi Kumar: హాట్ అందాలతో 'ఇన్‌స్టా'లో హీట్ పుట్టిస్తున్న రిద్ధి కుమార్

Riddhi Kumar: ముద్దుగుమ్మ అందాలతో సోషల్ మీడియా హీటెక్కుతుంది
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ రిద్ధి కుమార్ 'లవర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ఫెయిల్యూర్ అయింది. దాంతో ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ సినిమా తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.




చాలా కాలం పాటు ఈమె నెమ్మదిగా కెరీర్ను ముందుకు సాగించింది. అలాంటి సమయంలోనే ఈ బ్యూటీకి ప్రభాస్ హీరోగా రూపొందిన 'రాజా సాబ్'లో అవకాశం దక్కింది. దాంతో ఒక్కసారిగా ఈమె పేరు వార్తల్లో నిలవడం మొదలయింది.




ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో కూడా ఈ బ్యూటీకి మంచి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ చిత్రం గనుక విజయం సాధిస్తే ఈ నటి తెలుగులో అద్భుతమైన స్థాయికి చేరుకుంటుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజా సాబ్ మాత్రం విజయాన్ని అందుకోలేదు.




కానీ ఇందులో ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. సినిమాల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తున్న ఈ నటి 'ఇన్ స్టా'లో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో తన అభిమానులను అలరిస్తుంది.




రీసెంట్ టైంలో ఈమె చాలా సందర్భాలలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్లో ఉన్న ఫోటోలను తన 'ఇన్ స్టా'లో పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు బాగా వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే ఉంది.

Next Story