ఇంతకుమించి ఏమీ చెప్పలేను.. జైలు శిక్షపై RGV షాకింగ్ రియాక్షన్

by Gantepaka Srikanth |

చెక్‌బౌన్స్ కేసు(Check Bounce Case)లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు మూడు నెలల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ఇంతకుమించి ఏమీ చెప్పలేను.. జైలు శిక్షపై RGV షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: చెక్‌బౌన్స్ కేసు(Check Bounce Case)లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు మూడు నెలల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి వివరాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన ఏడేళ్ల క్రితం నాటి రూ.2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. ఈ కేసులో ఇప్పటికే నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున నేను ఇంతకుమించి ఏమీ చెప్పలేను’ అని ఆర్జీవీ(RGV) స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. రామ్‌ గోపాల్‌ వర్మకు ముంబయిలోని అంధేరీ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్‌ బౌన్స్‌ కేసుకు సంబంధించి అంధేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు(Andheri Magistrate Court) వర్మపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.7లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష విధిస్తామని కోర్టు హెచ్చరించింది. 2018లో మహేశ్‌ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఈ చెక్‌ బౌన్స్‌ కేసును వేశారు.

Next Story