- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RGV: ధనవంతుల సంతోషం కోసం పేదలు తమ రక్తంతో మూల్యం చెల్లించాల.. సంచలనంగా స్టార్ డైరెక్టర్ పోస్ట్
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై.. ప్రశంసలతో పాటు ఎక్కువ మొత్తంలో విమర్శలు కూడా వస్తున్నాయి.

దిశ, సినిమా: వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై.. ప్రశంసలతో పాటు ఎక్కువ మొత్తంలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విమర్శకులను ఆలోచింపజేసే విధంగా స్టార్ డైరెక్టర్ ఆర్‌జీవి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టాడు.
‘హే కుక్కల ప్రేమికులారా.. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం కుక్కలకు జరిగిన అన్యాయంపై కుక్క ప్రేమికులు అందరూ గట్టిగా అరుస్తున్నారు. కానీ నాలుగు సంవత్సరాల పిల్లవాడిని పట్టపగలు వీధుల్లో దారుణంగా చంపినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారు.. అదేవిధంగా ప్రతి సంవత్సరం వేలాది మంది దాడి చేయబడుతున్నారు. అప్పుడు మీ కరుణ ఎక్కడ ఉంది? అంటే చనిపోయిన పిల్లలు లెక్కించబడరా? తోకలు ఊపుతున్న వాటిపై మాత్రమే కరుణ ఉందా?.. అవును, కుక్కలను ప్రేమించడంలో తప్పు లేదు. నేను కూడా వాటిని ప్రేమిస్తున్నాను. కానీ మీ స్వంత ఇళ్లలో, మీ విలాసవంతమైన బంగ్లాల్లో, మీ అందమైన పచ్చిక బయళ్లలో మీ కుక్కలను ప్రేమించండి. మీరు ఇన్‌పోర్ట్ చేసుకున్న లాబ్రడార్‌లను, మీ వంశపారంపర్య హస్కీలను, పెంపకందారుల నుండి కొనుగోలు చేసిన మీ హై-జాతి పెంపుడు జంతువులను ప్రేమించండి.. అలాగే వాటిని చూసుకోవడానికి సిబ్బందిని నియమించుకోండి.
అయితే నిజం ఏంటంటే: మీ విలాసవంతమైన విల్లాలలో పెరుగుతున్న కుక్కల వల్ల బెడద ఉండదు. అయితే.. వీధుల్లో, మురికివాడల్లో, పేదలు నివసించే సందుల్లో, పిల్లలు చెప్పులు లేకుండా ఆడుకునే ప్రదేశాలలో, గేట్లు లేదా కనీసం కంచెలు కూడా లేని ప్రేదేశాల్లో అవి విచ్చలవిడిగా తిరగుతుండటం సమస్యగానే ఉంది. ఉన్నతవర్గం వారు ఇళ్లళ్లో పెంచుకుని మురిసిపోతుంటే.. లేనివారు గాయపడిన వారిని చూసుకోవడానికి, చనిపోయిన వారిని పాతిపెట్టడానికి మిగిలిపోతున్నారు.
మీరు కుక్క హక్కులపై మాట్లాడుతారు. ఓకే ఫైన్.. మరి పిల్లల హక్కుల సంగతేంటి? పిల్లలు జీవించే హక్కు, పిల్లల ఎదుగుదలను చూడాలనే తల్లిదండ్రుల హక్కు ఎటుపోతున్నాయి. మీరు కుక్కలను ప్రేమిస్తున్నందున ఆ హక్కులు అదృశ్యమవుతాయా? మీరు మీ సొంత వంశపారంపర్య పెంపుడు జంతువులను హగ్ చేసుకుంటూ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఫోటోల కంటే అవి తక్కువ ముఖ్యమైనవా?
మీరు వినకూడదనుకునే నిజం ఏంటంటే.. సమతుల్యత లేని కరుణ అన్యాయం. మీరు నిజంగా కుక్కలను ప్రేమిస్తే, వాటిని దత్తత తీసుకోండి.. వాటికి ఆహారం ఇవ్వండి. మీ సురక్షితమైన ఇళ్లలో వాటిని రక్షించండి. లేదా పరిష్కారాలను కనుగొనమని ప్రభుత్వాన్ని బలవంతం చేయండి. కానీ మీ ప్రేమతో వీధులపై భారం మోపకండి.. అది వేరొకరి బిడ్డ మరణానికి దారితీస్తుంది. ధనవంతుల ఎమోషనల్ హ్యాపీనెస్ కోసం పేదలు తమ రక్తంతో మూల్యం చెల్లించుకోకూడదు. పిల్లల ప్రాణం కంటే వీధి కుక్క ప్రాణానికి విలువ ఇచ్చే సమాజం ఇప్పటికే తన మానవత్వాన్ని కోల్పోయిందనే సత్యాన్ని గ్రహించండి’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు స్టార్ డైరెక్టర్ ఆర్‌జీవి.






