ప్రతీ నిద్ర ఒక క్రైమ్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

by Sujitha Rachapalli |

‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న హీరో అఖిల్ రాజ్.. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్‌తో మరో మూవీలో నటిస్తున్నట్లు తెలిసింది.

ప్రతీ నిద్ర ఒక క్రైమ్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న హీరో అఖిల్ రాజ్.. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్‌తో మరో మూవీలో నటిస్తున్నట్లు తెలిసింది. కాగా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు ఈ కుర్ర కథానాయకుడు. ‘మర్డర్’ మూవీ దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కిస్తున్న ‘ఫైట్ మహా’ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ‘ప్రతీ నిద్ర ఒక క్రైమ్.. ప్రతీ స్కెచ్ ఒక క్లూ’ అనే క్యాప్షన్‌తో మూవీపై ఇంట్రెస్ట్ పెంచారు మేకర్స్. న్యూ ఐ మూవీస్ బ్యానర్‌పై ఏవీఎస్ రాు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వసంత్ ఇసైపెట్టై సంగీతం సమకూరుస్తున్నారు.

TWEET

Next Story