- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధురంధర్ 2పై ఆర్జీవీ ప్రశంసల వర్షం.. దర్శకుడిని ఆకాశానికెత్తేశాడు
ధురంధర్ 2 చిత్రంపై ఆ మూవీ దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ గోపాల్ వర్మ.

దిశ, వెబ్ డెస్క్: ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2)పై విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇందులో హీరోగా రణ్‌వీర్ సింగ్ నటిస్తుండగా, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' లో షేర్ చేశారు.
సాధారణంగా సినిమాలపై ఎక్కువగా పాజిటివ్‌గా స్పందించని ఆర్జీవీ, ఈ సినిమాపై మాత్రం ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలో కల్ట్ క్లాసిక్ గా మిగిలిన షోలే సృష్టించిన ఇంపాక్ట్ కంటే కూడా “100 రెట్లు ఎక్కువ”గా ఉంటుందని చెప్పారు. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని అభిప్రాయపడ్డారు. ఇది చాలా అరుదుగా వచ్చే “గేమ్ ఛేంజర్” మూవీ అని ఈ దర్శకుడు కొనియాడారు.
దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరును ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. “డైరెక్టర్ అంటే ఏమిటో ఈ సినిమా తర్వాత కొత్త అర్థం వస్తుంది, అదే ఆదిత్య ధర్ అని అన్నారు. మొత్తానికి, ఆర్జీవీ లాంటి దర్శకుడు ఇంతగా పొగడటం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు ఇది డబుల్ బూస్ట్ ఇచ్చినట్లే అయింది.






