- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ బోర్డ్‌పై ఆర్జీవీ ఆగ్రహం
సెన్సార్ బోర్డ్ అవుట్ డేటెడ్ అయిపోయిందని విమర్శించాడు ఆర్జీవీ. దళపతి విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యల గురించి తాను మాట్లాడం లేదని.. నిజానికి చాలా కాలం క్రితం నుంచే సెన్సార్ బోర్డ్ మూర్ఖంగా వ్యవహరిస్తుందని తెలిపాడు.

దిశ, సినిమా : సెన్సార్ బోర్డ్ అవుట్ డేటెడ్ అయిపోయిందని విమర్శించాడు ఆర్జీవీ. దళపతి విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ సమస్యల గురించి తాను మాట్లాడం లేదని.. నిజానికి చాలా కాలం క్రితం నుంచే సెన్సార్ బోర్డ్ మూర్ఖంగా వ్యవహరిస్తుందని తెలిపాడు. ఇందుకు సినిమా ఇండస్ట్రీ బాధ్యత వహించాల్సి వస్తుందన్నాడు. 12 ఏళ్ల పిల్లోడు ఉగ్రవాద ఉరిశిక్షను.. తొమ్మిదేళ్ల పిల్లాడు అనుకోకుండా పోర్న్ చూడొచ్చని.. రిటైర్ అయిన వృద్ధుడు ఉగ్రవాద ప్రచారం.. కుట్ర సిద్ధాంతాల్లో మునిగిపోవచ్చన్నాడు. సినిమా శక్తివంతమైన మాధ్యమమనే పాత నమ్మకాన్ని ఉటంకిస్తే, సోషల్ మీడియా సినిమా కంటే చాలా ఎక్కువ చేరువై ఉందని మరచిపోవద్దని... అందులో రాజకీయ విషం, కమ్యూనల్ విషం, పాత్ర హత్యలు, డిబేట్స్ పేరుతో లైవ్‌లో సెన్సార్ లేని అరుపులు నిండి ఉన్నాయన్నాడు. ఇలాంటి రియాలిటీలో గౌరవనీయమైన సెన్సార్ బోర్డ్ ఒక సినిమాలో ఒక మాట కత్తిరించడం, ఒక షాట్ ట్రిమ్ చేయడం, సిగరెట్‌ను బ్లర్ చేయడం సమాజాన్ని రక్షిస్తుందని నమ్మడం ఒక జోక్ అంటూ విమర్శించాడు.






