స్టార్ హీరోలంతా ఇతన్ని చూసి ఈర్ష్య పడాలంటూ సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవీ.. నెటిజన్లు ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-26 07:13:09  IST  )

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

స్టార్ హీరోలంతా ఇతన్ని చూసి ఈర్ష్య పడాలంటూ సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవీ.. నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొద్ది కాలంగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పలు ఇంటర్వ్యూలో చేయడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ‘శారీ’(saree) సినిమాను తెరకెక్కించిన ఆయన త్వరలో స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌(Manoj Bajpai)లతో కలిసి ఓ హారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్జీవీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా, ఓ యంగ్ హీరో ఫొటో షేర్ చేస్తూ ఆయనను చూసి జలస్ పడాలని అన్నాడు. ఆర్య ఫొటో షేర్ చేస్తూ.. ‘‘నేను BUTTని ఎక్కువగా ఇష్టపడతానా లేదా అతని BICEPని ఎక్కువగా ఇష్టపడతానా అని నేను నిర్ణయించలేను. మీ అల్ట్రా ఫిట్‌నెస్‌ని చూసి స్టార్‌లందరూ F____ng అసూయపడతారు’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు ఆర్జీవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్టార్ హీరోలు ఫిట్‌గా లేరని నీ ఉద్దేశమా అని తిడుతున్నారు. అతన్ని మెచ్చుకోవడానికి ఇతరులను ఎందుకు తక్కువ చేస్తున్నావ్ అని అంటున్నారు. మొత్తానికి ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అయితే కొంతమంది మాత్రం ఆయనను సపోర్ట్ చేస్తున్నారు.

Click For Tweet..

Next Story