- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శారీ’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. హ్యాపీ వరల్డ్ శారీ డే అంటూ ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిర్మాణంలో గిరికృష్ణ కమల్(Giri Krishna Kamal) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’(Saree).

దిశ, సినిమా: రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిర్మాణంలో గిరికృష్ణ కమల్(Giri Krishna Kamal) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’(Saree). ఆరాధ్య దేవీ(Aaradhya Devi), సత్య యదు(Sathya Yadu) ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో శనివారం(December 21) వరల్డ్ శారీ డే కావడంతో ఆర్జీవీ సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ పాటను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ వరల్డ్ శారీ డే.. ‘శారీ’ సినిమా నుంచి శారీ గర్ల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా జనవరి 30 న రిలీజ్ కానుంది’ అని ఆర్జీవీ రాసుకొచ్చారు. ఇక శారీ గర్ల్.. అంటూ ఇంగ్లీష్‌లో సాగే ఈ పాటను ఆర్జీవీ ఛానల్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ పాటను హీరోయిన్‌ని లవ్ చేస్తున్న అబ్బాయి సినిమాలో పాడుతున్నట్టుగా అనిపించింది. అంతే కాకుండా ఈ సాంగ్‌లో కూడా హీరోయిన్ చీరలో తన అందాలను చూపిస్తూ హీట్ పుట్టించింది.






