RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఆ కేసులో మూడు నెలల జైలు శిక్ష

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-23 05:06:34  IST  )

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది.

RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఆ కేసులో మూడు నెలల జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ముంబై (Mumbai)లోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు (Andheri Magistrate's Court) సంచలన తీర్పును వెలువరించింది. కేసులో రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma)ను దోషిగా తేలుస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. అయితే, గత ఏడేళ్లుగా చెక్ బౌన్స్ విచారణ జరుగుతుండగా.. వర్మ కోర్టుకు హజరుకావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ (Non-Bailable) వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు. కాగా, 2018లో మహేష్‌చంద్ర మిశ్రా (Mahesh Chandra Mishra) అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story