‘రెట్రో’ ట్రైలర్ అప్డేట్.. ప్రేమ, నవ్వు యుద్ధాన్ని జయిస్తాయంటూ హైప్ పెంచుతున్న పోస్ట్

by Hamsa |
‘రెట్రో’ ట్రైలర్ అప్డేట్.. ప్రేమ, నవ్వు యుద్ధాన్ని జయిస్తాయంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ బ్యానర్స్‌పై దీనిని సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇక ఇందులో జయరామ్(Jayaram), కరుణాకరన్, వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న రెట్రో చిత్రం నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

తాజాగా, డైరెక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘రెట్రో’అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఏప్రిల్ 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఆ రోజు సాయంత్రం ట్రైలర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టైమ్ మాత్రం వెల్లడించలేదు. కానీ సూర్, పూజా హెగ్డే పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో వీరిద్దరు కళ్లలోకి కళ్లు పెట్టుకుని చూసుకుంటూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక అది చూసిన వారంతా ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. రెట్రో ట్రైలర్ రాబోతున్నట్లు తెలుసుకున్న సూర్య అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Next Story

Most Viewed