Retro: ఆ నిర్మాణ సంస్థకే సూర్య ‘రెట్రో’ తెలుగు రైట్స్.. వైల్డ్ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraju) కాంబినేషనల్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రెట్రో’ (Retro)

Retro: ఆ నిర్మాణ సంస్థకే సూర్య ‘రెట్రో’ తెలుగు రైట్స్.. వైల్డ్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraju) కాంబినేషనల్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రెట్రో’ (Retro). 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింమ్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన గ్లింప్స్ (Glimpses) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ అంశాలతో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 1న ప్రపంపవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ కానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక ప్రమోషన్స్ (Promotions) స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్‌డేట్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రెట్రో’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ వైల్డ్ పోస్టర్ (Wild poster) రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది.

Next Story