'రెట్రో' వెనుకడుగు.. సూర్య రీఎంట్రీ కల చెదిరిందా..?

by Bhanu |

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, వరుస పరాజయాలతో డీలా పడ్డ సూర్యకు 'రెట్రో'తో ఒక అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

రెట్రో వెనుకడుగు.. సూర్య రీఎంట్రీ కల చెదిరిందా..?
X

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, వరుస పరాజయాలతో డీలా పడ్డ సూర్యకు 'రెట్రో'తో ఒక అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సినిమా మొదటి భాగం కొంత ఆసక్తికరంగా అనిపించినా, ఆ తర్వాత కథనం నెమ్మదించింది. ముఖ్యంగా తెలుగు, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. విడుదలైన తర్వాత టాక్ నెగిటివ్‌గా రావడంతో, థియేటర్లకు వచ్చే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా 'రెట్రో'కు పెద్ద దెబ్బ తీసింది. నాని నటించిన 'హిట్ 3' తన ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీని దెబ్బకు 'రెట్రో' వెలవెలబోయింది. తెలుగు రాష్ట్రాల్లో బలమైన డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ, 'రెట్రో' ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. స్క్రీన్లు అందుబాటులో ఉన్నా, ప్రేక్షకుల హాజరు చాలా తక్కువగా ఉంది.

కేరళలో మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్' దూసుకుపోతుంటే, 'రెట్రో' అక్కడ తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. కర్ణాటకలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ సినిమా పూర్తిగా చతికిలపడింది. తమిళనాడులో అయితే, చిన్న సినిమా అయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' మౌత్ టాక్‌తో క్రమంగా పుంజుకొని ఇప్పుడు హిట్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో సబ్ టైటిల్స్‌తో ప్రదర్శితమవుతున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి కూడా మంచి స్పందన వస్తోంది. ఇది 'రెట్రో' పరిస్థితికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఉత్తరాదిలో కూడా రణ్‌వీర్ సింగ్ నటించిన 'రైడ్ 2' బలమైన పోటీనిచ్చింది. అన్ని వైపుల నుండి ఒత్తిడి రావడంతో, 'రెట్రో' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ ఫలితం సూర్య రీఎంట్రీ ఆశలను ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పుడు అభిమానులు సూర్య ఎప్పుడు ఒక మంచి, ప్రేక్షకులను మెప్పించే సినిమాతో తిరిగి వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Next Story