- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెస్పెక్ట్ ఉమెన్.. వన్ పర్సెంట్ తగ్గిన 100 పర్సెంట్ కొడతా అంటున్న యంగ్ హీరో.. బ్యూటీఫుల్ వీడియో వైరల్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు. అయితే అతని ఖాతాలో మంచి హిట్ పడలేవు. కానీ రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.
అలాగే రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేసింది మూవీ టీమ్. ఉమెన్స్ డే స్పెషల్‌గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మూవీలో చెప్పిన డైలాగ్‌ను షేర్ చేసింది. ఇక వీడియోలో.. లక్కీ గాడికి సరిగ్గా హ్యాండిల్ చేయడం రాలేదురా.. ఆఫ్ట్రాల్ ఒక ఆడది నిలబెట్టేసింది అని ఓ స్టూడెంట్ అనగానే మరో స్టూడెంట్ భలే చెప్పావురా అని నవ్వుతాడు. అప్పుడు అటుగా వెళ్తున్న హీరో(కిరణ్ అబ్బవరం) వచ్చి అతన్ని కొటతాడు.
వెంటనే ఎందుకురా కొట్టావ్ అని అడుగుతాడు. అప్పుడు హీరో నన్ను అన్నందుకు కాదురోయ్.. ఆఫ్ట్రాల్ ఒక ఆడది అన్నావ్ చూడు అందుకు కొట్టాను అని అంటాడు. వెంటనే వేరే అతను తనను అంటే నీకేంట్రా నొప్పి అని అంటాడు.. అప్పుడు మళ్లీ హీరో ‘రెస్పెక్ట్ ఉమెన్.. వన్ పర్సెంట్ తగ్గిన 100 పర్సెంట్ కొడతా.. అది నా అనుకునే వాళ్లకే కాదు నా చుట్టూ ఉండే వాళ్లకి కూడా అప్లై అవుతుంది జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫైనల్‌గా హ్యాపి ఉమెన్స్ డే అనే కొటేషన్ వస్తుంది. అంతటితో ఆ వీడియో అయిపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






