- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ ఫొటో షేర్ చేసిన రేణుదేశాయ్.. చాలా బాగున్నారంటూ కామెంట్స్.. పోస్ట్ వైరల్
పవన్ కళ్యాణ్(Pawan Kalyna) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johnny), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్(Pawan Kalyna) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johnny), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswara rao) మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
మళ్లీ మరో సినిమా చేయకుండా ప్రస్తుతం యాడ్స్‌లో పాల్గొంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాగే రీసెంట్‌గా తన కూతురి పేరు మీదుగా ఓ యానిమల్ ట్రస్ట్‌ను పెట్టి నడిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో నేచురల్ లుక్‌లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘స్ప్రింగ్ మార్నింగ్స్ అండ్ పూనె’ అనే క్యాప్షన్ జోడిస్తూ పింక్ హార్ట్ సింబల్ జోడించింది. అయితే ఈ భామ చాలా రేర్‌గా సోషల్ మీడియా(Social Media)లో తన ఫొటోలు షేర్ చేస్తుంది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు వావ్ చాలా బాగున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.






