Renu Desai: మాకు రైస్ అండ్ డబ్బులు సాయం చేసినందుకు ధన్యవాదాలు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Renu Desai: మాకు రైస్ అండ్ డబ్బులు సాయం చేసినందుకు ధన్యవాదాలు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johnny), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు(divorce) తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య(aadhya), అకిరా నందన్(Akira Nandan)) బాధ్యతలు చూసుకుంటుంది.

అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం యాడ్స్‌కి సంబంధించిన షూట్స్‌లో పాల్గొంటూ అభిమానులను దగ్గరవుతూ ఉంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది.

ఇందులో భాగంగా రీసెంట్ తన కూతురు ఆద్య పేరు మీదుగా ‘శ్రీ ఆద్య యానిమల్ ట్రస్ట్’ కూడా పెట్టి ప్రజెంట్ వాటి బాధ్యతలు చూసుకుంటుంది. ఈ క్రమంలో.. తాజాగా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘కుక్కపిల్లల కోసం రైస్ అండ్ మనీ డొనేషన్ చేసిన మా ఇన్‌స్టా గ్రామ్ పీపుల్స్‌కి నిజంగా థ్యాంక్స్. ఈ బియ్యం ఈ మంత్ వరకు మాకు సఫిషియంట్‌గా సరిపోతుంది’ అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Next Story